ఉత్తర కెరలైన అమెరికా సంయుక్త రాష్ట్రాల దేశపు ఆగ్నేయ ప్రాంతంలోని ఒక రాష్ట్రం. ఉత్తరాన వర్జిన్య, తూర్పున ఎట్లెన్ట మహాసముద్రం, దక్షిణాన దక్షిణ కెరలైనా, నైరుతిన జోర్జ, పడమరన టెనిసి దీని సరిహద్దులు. యు.ఎస్‌లో ఈ రాష్ట్రం, అతిపెద్ద రాష్ట్రాల్లో 28వ స్థానంలోనూ, అత్యధిక జనాభా క…ఉత్తర కెరలైన అమెరికా సంయుక్త రాష్ట్రాల దేశపు ఆగ్నేయ ప్రాంతంలోని ఒక రాష్ట్రం. ఉత్తరాన వర్జిన్య, తూర్పున ఎట్లెన్ట మహాసముద్రం, దక్షిణాన దక్షిణ కెరలైనా, నైరుతిన జోర్జ, పడమరన టెనిసి దీని సరిహద్దులు. యు.ఎస్‌లో ఈ రాష్ట్రం, అతిపెద్ద రాష్ట్రాల్లో 28వ స్థానంలోనూ, అత్యధిక జనాభా కల రాష్ట్రాల్లో 9వ స్థానంలోనూ ఉంది. దీన్నీ, దక్షిణ కెరలైనానీ కలిపి కెరలైనాలు అంటారు. ఈ కెరలైనాలు యు.ఎస్ తూర్పు తీర ప్రాంతాలు. 2020 లెక్కల ప్రకారం, ఉత్తర కెరలైన జనాభా 10,43,93,888. రాష్ట్ర రాజధాని రోలి కాగా, అత్యధిక జనాభా కల నగరం షార్లట్. 2023లో సుమారు 28,05,115 జనాభాతో షార్లట్ మెట్రోవాలిటన్ ప్రాంతం రాష్ట్రంలో అత్యధిక జనాభా కల మెట్రోపాలిటన్ ప్రాంతల్లో మొదటి స్థానంలో ఉండగా, దేశంలో 22వ స్థానంలో నిలబడడంతో పాటు, న్యుయార్క్ తరువాత అతి పెద్ద బ్యాంకింగ్ కేంద్రంగా నిలుచుంది.