టర్కీ, అధికారికంగా టర్కీ గణతణత్రం అని వ్యవహరిస్తారు. ఇది ఒక యూరేషియా దేశం. అనగా ఇటు ఆసియా లోనూ అటు ఐరోపా లోనూ విస్తరించియున్నది. అనటోలియా ద్వీపకల్పంలోనూ, పశ్చిమాన ఆసియా, రుమేలియా లోనూ వ్యాపించి యున్నది. టర్కీకి 8 పొరుగుదేశాల సరిహద్దులు గలవు. ఈశాన్యంలో బల్గేరియా, పశ్…
టర్కీ, అధికారికంగా టర్కీ గణతణత్రం అని వ్యవహరిస్తారు. ఇది ఒక యూరేషియా దేశం. అనగా ఇటు ఆసియా లోనూ అటు ఐరోపా లోనూ విస్తరించియున్నది. అనటోలియా ద్వీపకల్పంలోనూ, పశ్చిమాన ఆసియా, రుమేలియా లోనూ వ్యాపించి యున్నది. టర్కీకి 8 పొరుగుదేశాల సరిహద్దులు గలవు. ఈశాన్యంలో బల్గేరియా, పశ్చిమాన గ్రీసు, వాయవ్యంలో జార్జియా, తూర్పున ఆర్మీనియా, అజర్‌బైజాన్, ఇరాన్, ఆగ్నేయంలో ఇరాక్, సిరియాలు గలవు. దక్షిణాన మధ్యధరా సముద్రము, సైప్రస్, ఏగియన్ సముద్రము, ద్వీపసమూహములు పశ్చిమాన, ఉత్తరాన నల్ల సముద్రము గలవు.